జలపాతం వద్ద సరదాగా మొదలైన ట్రిప్.. క్షణాల్లో విషాదంగా మారింది!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇండోనేషియాలోని రోబో జలపాతం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు, ఒక యువకుడు కలిసి జలపాతాన్ని సందర్శిస్తుండగా, యువకుడు అకస్మాత్తుగా జారి ఉద్ధృతమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
స్నేహితుల కళ్లముందే జరిగిన ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
పర్యాటక ప్రాంతాల్లో, ముఖ్యంగా జలపాతాలు–వేగమైన ప్రవాహాల వద్ద చిన్న నిర్లక్ష్యం కూడా ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.





