కిట్క్యాట్ ఓపెన్ చేస్తే షాక్!.. చాక్లెట్లో పురుగులంటూ వీడియో వైరల్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ కూకట్పల్లిలోని లులు మాల్లో కొనుగోలు చేసిన కిట్క్యాట్ చాక్లెట్లో పురుగులు కనిపించాయంటూ ఓ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చాక్లెట్ను తెరిచిన తర్వాత అందులో పురుగులు కదులుతున్నట్లు వీడియోలో చూపిస్తూ ఆ వినియోగదారు ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో వైరల్ కావడంతో ఫుడ్ క్వాలిటీ, స్టోరేజ్ పరిస్థితులపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
అయితే ఈ వీడియోలో చేసిన ఆరోపణలపై సంబంధిత సంస్థలు లేదా ఫుడ్ సేఫ్టీ అధికారుల అధికారిక స్పందన రావాల్సి ఉంది.





