సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు కీలక మలుపు.. CBI విచారణకు హైకోర్టు ఆదేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తును CBIకి అప్పగిస్తూ, సాయికృష్ణ తల్లికి రూ.25 లక్షల పరిహారం నాలుగు వారాల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సాయికృష్ణను కృష్ణలంక పోలీసుల అదుపులోకి తీసుకున్న తర్వాత అతను మృతి చెందినట్లు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన SIT దర్యాప్తుపైనా పలు ప్రశ్నలు తలెత్తాయి.
ఇప్పుడు CBI దర్యాప్తులో సాయికృష్ణ పోలీసు అదుపులో ఉన్న పరిస్థితులు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన పరిణామాలు, CCTV ఫుటేజ్ గల్లంతు, మృతదేహం తరలింపు–దహనం అంశాలు కీలకంగా పరిశీలనకు రానున్నాయి.





