డ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
డ్రగ్స్ ఫ్రీ ఏపీ లక్ష్యంగా మాదకద్రవ్యాలు, గంజాయి ముఠాలపై ఏపీ ఇంటెలిజెన్స్ ఉక్కుపాదం మోపుతోంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారంతో విజయవాడ రైల్వే స్టేషన్లో ఏపీ పోలీసులు కీలక ఆపరేషన్ చేపట్టారు. బెంగళూరు నుంచి రైలులో డ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని యెర్రంశెట్టి నాగ సౌమ్యను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి రూ.11 లక్షల విలువైన 110 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.





