నేడు గాంధీ భవన్లో కాంగ్రెస్ సమీక్ష

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ కీలక సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరుకానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకాలపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పీసీసీ చీఫ్ కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. మండల, టౌన్, డివిజన్ కమిటీల నియామకం పూర్తికాని ప్రాంతాల అధ్యక్షులతో సచిన్ సావంత్ ప్రత్యేకంగా చర్చించనున్నారు.





