ముగిసిన లక్ష్మీ భాస్కర్ ఏసీబీ కస్టడీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ఏసీబీ కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణలో ఏసీబీ అధికారులు కీలక అంశాలు రాబట్టారు. న్యాయవాది సమక్షంలో లగ్జరీ కార్లు, ప్లాట్లు, ఆభరణాలు, పెట్టుబడులపై ఆరు పేజీల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కొన్ని ఆస్తులు మాత్రమే తనవని ఒప్పుకున్న ఆయన.. బినామీల వివరాలపై నోరుమెదపలేదు. కస్టడీ ముగియడంతో లక్ష్మీ భాస్కర్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలుకు రిమాండ్ తరలించారు.





