ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో లక్షల మోసం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఫేస్బుక్లో బీఎక్స్బీ ట్రేడింగ్ పేరుతో వచ్చిన నకిలీ ప్రకటన చూసి కిస్మత్పూర్కు చెందిన కవిత మోసపోయింది. 20 వేల పెట్టుబడి పెడితే వారంలో 80 వేల లాభమంటూ ఆశచూపడంతో.. విడతలవారీగా 62.26 లక్షలు బదిలీ చేసింది. డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.





