ఏపీ పట్టణ పోరుకు కూటమి లెక్క ఫిక్స్.. టీడీపీ 89, జనసేన 25, బీజేపీ 9!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి సీట్ల పంపకం ఖరారైంది.
మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీ 11, జనసేన 4, బీజేపీ 2 చోట్ల పోటీ చేయనున్నాయి.
అలాగే 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో టీడీపీకి 78, జనసేనకు 21, బీజేపీకి 7 కేటాయించారు.
దీంతో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో టీడీపీ 89, జనసేన 25, బీజేపీ 9 చోట్ల బరిలో నిలవనున్నాయి.
జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు దక్కగా, బీజేపీకి రాజమండ్రి, అనంతపురం కేటాయించారు. మిగిలిన 11 కార్పొరేషన్లలో టీడీపీ పోటీ చేయనుంది.





