రైల్వే ట్రాక్‌పై కారు.. ఢీకొట్టిన రైలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మధ్యప్రదేశ్‌లోని రత్నలామ్లో రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న కారును ప్రయాణికుల రైలు ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.
రైల్వే గేట్ మూసుకుపోయే సమయంలో కారు ట్రాక్‌పై చిక్కుకుపోయినట్లు సమాచారం. డ్రైవర్ కారును ట్రాక్ నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు.
ప్రమాదాన్ని గమనించిన లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించగా, కారులో ఉన్న వారిని సమయానికి బయటకు తరలించారు. దీంతో భారీ ప్రమాదం తప్పి, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
అనంతరం రైలు కారును ఢీకొట్టడంతో వాహనం దెబ్బతిన్నప్పటికీ, ముందస్తు అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది.





