పంజాబ్‌లో కుండపోత.. ఫాజిల్కా మార్కెట్‌లో నీటమునిగిన ధాన్యం రాశులు
పంజాబ్‌లోని ఫాజిల్కా ధాన్యం మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం పూర్తిగా నీటమునిగింది..
మార్కెట్‌లో సుమారు 3 అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో ధాన్యం కుప్పల నుంచి వరి పంట నీటిపై తేలియాడుతోంది..
వరిలో తేమ శాతం 35 శాతం నుంచి 50 శాతం వరకు చేరింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతించిన పరిమితి కేవలం 17 శాతం మాత్రమే..
ఇది కనీస మద్దతు ధరకు ప్రభుత్వం సేకరించాల్సిన పర్మల్ రకం వరి ధాన్యం..
ప్రతి గింజనూ కొంటామని పంజాబ్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పుడు ఈ తడిసిన ధాన్యాన్ని కొంటారా అని మండి ప్రతినిధి ప్రశ్నించారు..
నీటమునిగిన ఈ ధాన్యం బస్తాలను ఏ రైస్ మిల్లర్ లేదా కొనుగోలు ఏజెన్సీ తూకం వేసి తీసుకుంటుందని ఆయన నిలదీశారు..
మండిలో సరిపడా సామర్థ్యం లేక రైతులు నష్టపోతున్నారని, అదనపు యార్డుల అనుమతి కోరుతూ తాము గతంలో మండిని మూసివేసినట్లు తెలిపారు..
నిబంధనల కంటే తేమ శాతం అధికంగా ఉండటంతో పంట కొనుగోళ్లపై అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.





