ఐసీసీ చైర్మన్‌గా జై షా రెండోసారి.. ఏకగ్రీవ ఎన్నిక

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమిత్ షా కుమారుడైన జై షా ఈ పదవికి ఎన్నికయ్యారు.
ఇండోనేషియాలోని బాలిలో జరిగిన బోర్డు సమావేశాల్లో జై షా రెండోసారి ఏకగ్రీవంగా నియమితులయ్యారని ఐసీసీ పేర్కొంది. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా అధికారికంగా ధ్రువీకరించింది.
దీంతో ఆయన మరో రెండేళ్లపాటు ఐసీసీ చైర్మన్‌గా కొనసాగనున్నారు.
గతంలో బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన జై షా, 2024 డిసెంబర్ 1న తొలిసారి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.





