29 ఏళ్ల అర్చన మృతి కేసులో కొత్త వివరాలు…వీడియో కాల్ తర్వాత విషాదం..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ మాదాపూర్‌లో 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అర్చన చౌదరి మాలిక్ మృతి కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనకు ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వివాహితుడితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
ఘటనకు ముందు అర్చన అతడికి వీడియో కాల్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె ఫోన్‌కు స్పందించకపోవడంతో అతడు అర్చన ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నట్లు సమాచారం.
తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా అర్చన ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్లు సమాచారం.
పెళ్లి విషయమై ఇద్దరి మధ్య ఏం జరిగింది? అర్చన మృతికి దారితీసిన పరిస్థితులేంటి? అనే అంశాలపై మాదాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





