రేపు ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టే ప్రధాన అజెండా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరనున్నారు. రాత్రి అక్కడే బస చేసి, సోమవారం ఉదయం 11 గంటలకు ముంబై సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. తెలంగాణ బృందంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.





