హర్మన్-దీప్తి శతకాల జోరు.. జింబాబ్వేను 121 పరుగుల తేడాతో చిత్తు! సిరీస్ భారత్ సొంతం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వడోదర వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు జింబాబ్వేపై 121 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో భారత్ కైవసం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 328/6 భారీ స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 126 పరుగులతో అదరగొట్టగా, దీప్తి శర్మ 106 నాటౌట్‌తో మరో అద్భుత సెంచరీ నమోదు చేసింది.
329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో వైష్ణవి శర్మ 4 వికెట్లతో మెరిసింది.
Official Handle: @BCCIWomen





