చిల్లరతో మొదలైన గొడవ... కండక్టర్‌ను బస్సు నుంచి తోసేసి ప్రాణాల మీదకు తెచ్చిన ప్రయాణికురాలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
బస్సులో చిల్లర విషయంలో ప్రయాణికురాలు, కండక్టర్ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రయాణికురాలు కండక్టర్‌ను బస్సు నుంచి బయటకు తోసేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.
బస్సు నుంచి కిందపడిన కండక్టర్ టైర్ల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





