గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రామిరెడ్డి తోటలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి..

ఘటన విషయాన్ని తెలుసుకొని హుటాహుటిన జీజీహెచ్ కి చేరుకున్న గుంటూరు నగర వైసిపి అధ్యక్షురాలు, ఈస్ట్ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా, స్థానిక 8వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వినోద రాణి..
షేక్ నూరి ఫాతిమా కామెంట్స్*..
వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు..
ఈస్ట్ లోనే కాదు గుంటూరు నగరవ్యాప్తంగా వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి.
నగర ప్రజల ప్రాణాలంటే స్థానిక ఎమ్మెల్యేలకు, నగరపాలక సంస్థకు లెక్క లేదు.
కుక్కల దాడికి ఎంతమంది చిన్నారులు, మహిళలు బలి కావాలి.
కుక్కల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు.
పారిశుద్ధ్యం సరిగా లేని, చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లోనే వీధి కుక్కలు అధికంగా ఉంటున్నాయి.
వీధి కుక్కల నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు.
పిల్లలు ఆడుకునేందుకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మా నసీర్ అన్న చదువుకున్నా, చదువుకొని వ్యక్తులు మాదిరిగా వ్యవహరిస్తూ ఉంటారం
సమస్య మీద మాట్లాడమంటే తాటతీస్తాను, తోలు వోలుస్తాను, చమడాలు తీస్తాను అని మాట్లాడుతారు.
ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో బాగా సంపాదించి వచ్చిన గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా చూపిస్తా అంటారు..
సమాజంలో ప్రశ్నించే గొంతు అవసరం.
వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలుస్తాం..





