29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. మాదాపూర్‌లో కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ మాదాపూర్ చంద్రానాయక్ తండాలో ఓ ఇంట్లో 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
మృతురాలిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చన చౌదరి మాలిక్ (29)గా గుర్తించారు. ఆమె మైండ్‌స్పేస్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. మృతికి దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.





