బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా (Deep Depression) మారింది. అక్టోబర్ 25, 2026 ఉదయం 11:30 గంటలకు ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైంది. ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర దక్షిణ ఒడిశా తీరాలకు ఆరెంజ్ మెసేజ్ జారీ అయ్యింది.
అక్టోబర్ 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అక్టోబర్ 28 ఉదయానికి గంటకు 115-125 కి.మీ వేగంతో, గరిష్టంగా 140 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరాలను దాటనుంది.
అక్టోబర్ 26 తెల్లవారుజామున తుఫానుగా, 27 ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుంది. అక్టోబర్ 28 ఉదయానికి వాయువ్య దిశగా పయనిస్తూ, మరింత బలపడి అత్యంత తీవ్ర తుఫానుగా (Very Severe Cyclonic Storm) మారి ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది.
అక్టోబర్ 25 ఉదయం 11:30 గంటలకు 15.1°N అక్షాంశం, 91.0°E రేఖాంశం వద్ద ఇది కేంద్రీకృతమై ఉంది.
శ్రీ విజయపురానికి 420 కి.మీ, విశాఖపట్నంకు 870 కి.మీ, కాకినాడకు 960 కి.మీ, మచిలీపట్నానికి 1060 కి.మీ, బాపట్లకు 1130 కి.మీ దూరంలో ఈ వ్యవస్థ కేంద్రీకృతమై ఉంది.





