తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లదాడికి యత్నం

వద్దని వారించిన జెసి ప్రభాకర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
తాడిపత్రిలో తన ఇంటి నుంచి స్వగ్రామం తిమ్మంపల్లి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
గడిచిన నాలుగు రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
ఇవాళ స్వగ్రామం తిమ్మంపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
తిమ్మంపల్లిలో టిడిపి నాయకుడిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి చేయి చేసుకున్నాడని ఆగ్రహంతో తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసేందుకు ప్రయత్నించిన జెసి వర్గీయులు
వెంటనే టిడిపి కార్యకర్తలు... తన అనుచరులను రాళ్లదాడి చేయకుండా వారించిన జెసి ప్రభాకర్ రెడ్డి
రాళ్ల దాడికి ప్రయత్నించినప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో లేడు
అప్పటికే తిమ్మంపల్లి వెళ్లిపోయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి
రాళ్ల దాడి చేసేందుకు టిడిపి కార్యకర్తలు వచ్చిన విషయం తెలుసుకొని కేతిరెడ్డి ఇంటికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు
టిడిపి, వైసిపి కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేసిన పోలీసులు





