చంద్రగిరి వైసీపీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియా సమావేశం.

ఎమ్మెల్యే పులివర్తి నానికి ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఆయన వ్యవహారశైలే చెబుతోంది.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా వైసీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు.
వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ కేంద్రాల వద్ద 1,200 మంది రౌడీ మూకలతో అలజడి సృష్టించారు.
పదుల సంఖ్యలో దాడులు చేసి వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారు.
నాలుగు మండలాల్లో వైసీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టించారు.
94 స్థానాల్లో స్క్రూటినీ పేరు తో వందలాది మంది వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.
వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై న్యాయ పోరాటం చేస్తాం.
4 మండలాల్లో తిరిగి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
వైసీపీ అభ్యర్థులు పోరాట పటిమ కలిగినవారు. వారికి పార్టీ అండగా ఉంటుంది.
ఒక్క ఎంపీటీసీ స్థానంలోనైనా పోటీ చేసి మా సత్తా ఏంటో నిరూపిస్తాం.
భగవంతుడి ఆశీస్సులు మా వైపే ఉన్నాయి. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి వైసీపీ ఇంచార్జ్





