బెంగుళూరు వాసిని అని లేఖలో జగన్ ఒప్పుకోవడంపై చంద్రబాబు సూటి ప్రశ్నలు

అమరావతి: మేనకోడలి పెళ్లి విషయంలో జగన్ నైతికతపై సిఎం చంద్రబాబు సూటి ప్రశ్నలకు సమధానం చెప్పలేక జగన్ తత్తరపాటు కు గురవుతున్నారంటున్న టీడీపీ వర్గాలు
ఆహ్వాన పత్రిక ముద్రించుకున్న తరవాత ఇంత నిర్ధయగా వ్యవహరించే వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న సిఎం
ప్యాలెస్ ను పెళ్లికి ఇవ్వలేను అని అక్టోబర్ 9వ తేదీన తాను రాసిన లేఖను జగన్ బయట పెట్టడం పైనా ప్రశ్నిస్తున్న టిడిపి
కొత్త చర్చకు తావునిచ్చేలా లేఖలో పలు కీలక అంశాలు ఉన్నాయంటున్న టిడిపి వర్గాలు
పెళ్లి జరిపితే వీడియో గ్రాఫర్లు, అతిథులు, ప్రజలు వచ్చి వీడియోలు, ఫోటోలు దిగుతారని పేర్కొన్న దాంతో ప్యాలెస్ లోపలి అన్ని వివరాలు బయట బయటపడడం ఏంటంటున్న టిడిపి
పెళ్లికి అనుమతిస్తే వేలకోట్ల విలువైన నివాసంలోని ఇంటి లోపలి వీడియోలు, లగ్జరీ వ్యవహారాలు బయటకు వస్తాయని జగన్ స్వయంగా లేఖలో పేర్కొన్నారంటూ టిడిపి ఎద్దేవా
నేను బెంగుళూరు వాసిని అని లేఖ ద్వారా జగన్ తేల్చి చెప్పారంటూ టిడిపి విమర్శలు
నేను ఇక్కడే నివసిస్తున్నానని తాను బెంగుళూరుకు షిప్ట్ అయ్యి...అక్కడే ఉంటున్న విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించారన్న టిడిపి
ఒక రాజకీయ పార్టీ నడుపుతూ, ఎపిలో రాజకీయం చేస్తూ తాను బెంగుళూరు వాసిని అని ప్రత్యక్షంగా లేఖలో చెప్పడంపై అభ్యంతరం
చివరి వరకు ఇది నా ఇల్లు అని లేఖ రాసి సంతకం పెట్టి జగన్ లేఖ ఇవ్వడంపై ఏపీ రాజకీయాలతో జగన్ కి సంబంధం ఏంటి అంటున్న అధికార పార్టీ నేతలు





