డీకే అరుణ బిజెపి ఎంపీ

పాలమూరు రైతుల హక్కులను కాపాడాలి..డిండి లిఫ్ట్‌కు శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీరు ఇవ్వడం సరికాదు
డిండి ప్రాజెక్టుకు నీరు ఇవ్వడం పాలమూరు రైతాంగానికి అన్యాయం చెయ్యడమే
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్ భాగం కాదు
డిండి లిఫ్ట్‌కు బదులుగా SLBC లేదా ఇతర మార్గాల ద్వారా నల్గొండకు నీరు అందించండి
పాలమూరు జిల్లాలో ఇంకా లక్షల ఎకరాలకు సాగునీరు అందడంలేదు
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అసలైన రూపురేఖలు మార్చారు
ప్రాజెక్టును జూరాల నుంచి చేపట్టాలన్న పాత ప్రతిపాదనపై సమీక్ష చేయాలని డిమాండ్
శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి వచ్చే నీటిని పాలమూరు రైతుల ప్రయోజనాలకే వినియోగించాలి
డిండి లిఫ్ట్ కోసం కొత్తగా నీటి మార్గం ప్రతిపాదించడంపై అభ్యంతరం
ఒక మార్గం నుంచి నీటిని తీసుకెళ్లి మరోచోటికి మళ్లించే అవసరం ఏమిటి?
డిండి ప్రాజెక్టు కారణంగా పాలమూరు ప్రాంతంలోని రైతుల భూములు, గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది
గతంలో డిండి ప్రాజెక్టు రూపకల్పనపై స్థానికులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలిపారు
ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలనే లక్ష్యంతో పుట్టంగండి లిఫ్ట్ చేపట్టారు
పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు ఏళ్లుగా ఎందుకు పూర్తికావడంలేదు
ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
పదవులు శాశ్వతం కావు, రైతుల హక్కులను రాజకీయాల కోసం అణచివేయవద్దు
పాలమూరు ఎమ్మెల్యేలు రైతుల సమస్యలపై ఏకమై గట్టిగా మాట్లాడాలి
దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, జడ్చర్ల, కొడంగల్ తదితర ప్రాంతాలకు నీటి పంపిణీపై సమగ్ర ప్రణాళిక కోరారు
ప్రతి నియోజకవర్గానికి రిజర్వాయర్లు నిర్మించి సాగునీరు అందించే అవకాశాలను పరిశీలించాలి





