పటాన్‌చెరులో డ్రగ్స్ రసాయనాల ఫ్యాక్టరీని ఛేదించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

తెలంగాణలో డ్రగ్స్ తయారీకి ఉపయోగించే రసాయనాల అక్రమ ఫ్యాక్టరీని ఛేదించిన ముంబై క్రైమ్ డిటెక్షన్ బ్రాంచ్.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని ఐడీఏ పాశమైలారంలో ఫ్యాక్టరీపై దాడులు
MD డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 2-Bromo-4-Methylpropiophenone రసాయన పొడి తయారు చేస్తున్నట్లు పోలీసుల గుర్తింపు.
ఫ్యాక్టరీ నిర్వాహకుడు రమేష్ బాబు సాకేను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ఫ్యాక్టరీ నుంచి 44.699 కిలోల రసాయన పొడి స్వాధీనం.
స్వాధీనం చేసుకున్న రసాయన పొడి విలువ రూ.27 లక్షలు ఉంటుందని అంచనా
రసాయనాల తయారీకి ఉపయోగించే ఇతర కెమికల్స్, ల్యాబ్ పరికరాలు కూడా సీజ్ చేసిన అధికారులు...
పటాన్‌చెరు పోలీసుల సహకారంతో ముంబై క్రైమ్ డిటెక్షన్ ప్రత్యేక ఆపరేషన్..
గతంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో MD తయారీ ఫ్యాక్టరీలను కూడా ఛేదించినట్లు పోలీసుల వెల్లడి.
ఇప్పటివరకు 69 కిలోల 871 గ్రాముల MD డ్రగ్స్, 260 లీటర్ల రసాయనాలు, నగదు, ల్యాబ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటన.
డ్రగ్స్ తయారీ, రసాయనాల సరఫరా, విక్రయాలు, ఆర్థిక లావాదేవీల నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు..





