వ్యవసాయ పొలాల్లో అడవి ఏనుగు మృతి.. హైటెన్షన్ లైన్లపై అనుమానం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుపతి–చిత్తూరు జిల్లా సరిహద్దులోని ఇరాల మండలం చుక్కవారిపల్లి సమీప వ్యవసాయ పొలాల్లో ఓ అడవి ఏనుగు మృతిచెందింది.
శనివారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు ఏనుగు మృతదేహాన్ని గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ప్రాథమికంగా, ప్రాంతంలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలి ఏనుగు విద్యుదాఘాతానికి గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఏనుగు మృతికి ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు.





