ఉదయం ఇంటి నుంచి వెళ్లి.. బావిలో మృతదేహంగా కనిపించిన 21 ఏళ్ల మహేశ్వరి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్వరి (21) వ్యవసాయ బావిలో మృతదేహంగా కనిపించింది.
నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న మహేశ్వరికి తొమ్మిది నెలల పాప, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.
శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, వ్యవసాయ బావిలో మృతదేహాన్ని గుర్తించారు.
మహేశ్వరి మృతికి కారణం ఇంకా తెలియరాలేదు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





