తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
పాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటనతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుపాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటనతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటు
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ₹1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు భారతీయ ప్రయాణికులను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే AirAsia విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన ఓ వ్యక్తి క్యాబిన్ బ్యాగేజీలో తనిఖీలు నిర్వహించగా, బట్టల మధ్య నల్ల ప్లాస్టిక్ కవర్‌లో దాచిన USD 66,600, MYR 3,773, SGD 2 గుర్తించారు. వీటి విలువ సుమారు ₹63.62 లక్షలు.

అతని సమాచారంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళను తనిఖీ చేయగా, ఆమె బ్యాగేజీలో USD 97,600, సుమారు ₹91.94 లక్షల విలువైన కరెన్సీ బయటపడింది.

మొత్తంగా USD 1,64,200 సహా ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్న అధికారులు, చట్టబద్ధమైన ఆధారాలు చూపలేకపోవడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు