తెలుగు ఎడిషన్ · 24 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
పాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటనతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటుపాఠశాలకు వెళ్తున్న టీచర్‌ను బలిగొన్న పేలుడు.. అల్లూరి జిల్లాలో ఐదుగురు మృతిహైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్అల్లూరి జిల్లా: పినకోట ప్రమాదంపై పోలీసుల ప్రకటనతూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం ,సిగరమ్మ చింత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంఅమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్తెలంగాణ కల్లుకు గ్లోబల్ ఛాన్స్.. మలేసియాలో షురూ అయిన జోష్!జైలర్ 2 బాక్సాఫీస్ అప్‌డేట్స్నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడ్కరీ ఓటు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
అమెరికాలో లాస్ వెగాస్,నెవాడా ప్రాంతంలో భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్పరియాలను అరెస్ట్ చేసిన అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు

ఇద్దరు గ్యాంగ్స్టర్లను భారత్ కి అప్పగించే విషయంపై అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న దర్యాప్తు సంస్థలు

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తో పాటు ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో హిమాన్షు పేరు

హిమాన్షు ను అదుపులోకి తీసుకోవడానికి నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న భారత ఏజెన్సీలు

హరియాణాకు రోహతక్ జిల్లా రిటోలికి చెందిన హిమాన్షు

ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో హత్య, హత్యాయత్నం, దోపిడీ, అక్రమ ఆయధాల రవాణా వంటి 18 క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్న హిమాన్షు

2022 మార్చి నెలలో 24 రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేసిన

హిమాన్షు

2022లో నకిలీ పత్రాల ద్వారా పొందిన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి, విదేశాలకు పారిపోయిన హిమాన్షు

దుబాయ్‌కి, ఆ తర్వాత పోర్చుగల్ వంటి యూరోపియన్ సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న హిమాన్షు

విదేశాల నుంచే ఢిల్లీ ,హరియాణా, పంజాబ్ లో వందల మంది అనుచరులతో ఓ క్రిమినల్ నెట్ వర్క్ నిర్మించుకున్న హిమాన్షు

నెట్ వర్క్ షూటర్లను ఆదేశించడానికి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్‌లను ఉపయోగించుకున్న హిమాన్షు

గతేడాది ప్రారంభంలో డంకీ రూట్ ద్వారా అమెరికాకు చేరుకున్న హిమాన్షు

వ్యాపారవేత్తలను బెదిరించడం, హత్యలు ,కాల్పులు, దోపిడీలు, కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడుతున్న హిమాన్షు ముఠా

ఢిల్లీ నరైనా, తిలక్ నగర్‌లోని కార్ షోరూమ్‌లపై కాల్పులు జరపడంతో పాటు, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వ్యాప్తంగా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు స్థానిక వ్యాపారుల నుండి కోట్లాది రూపాయల దోపిడీ , బెదిరింపులకు పాల్పడిన హిమాన్షు ముఠా

2023లో హిమాన్షు భావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన ఇంటర్ పోల్ అధికారులు

లారెన్స్ బిష్ణోయ్-గోల్డీ బ్రార్ నెట్వర్క్తో హిమాన్షు భావు గ్యాంగ్ కి ఉన్న వైరం

ఢిల్లీ, హరియాణాలలో జరిగిన అనేక హై-ప్రొఫైల్ కాల్పులు, హత్య కేసుల్లో ఉన్న హిమాన్షు ముఠా హస్తం

ఢిల్లీలోని బర్గర్ కింగ్ అవుట్లెట్లో జరిగిన హత్య, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నివాసం వెలుపల కాల్పులు, పలు వ్యాపారవేత్తలపై దాడుల్లో హిమాన్షు ముఠా ప్రమేయం ఉన్నట్లు సమాచారం.

హరియాణాకు చెందిన నీరజ్ ఫరీదురియాపైనా 25కు పైగా క్రిమినల్ కేసులు

హిమాన్షు భావు ముఠాతో కలిసి నేర కార్యకలాపాలు సాగిస్తున్న నీరజ్ ఫరీదురియా

X లో చూడండి ›

సంబంధిత వార్తలు