రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దౌర్జన్యం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం బుచ్చంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేయి చేసుకున్నారు. తనకు చెప్పకుండా టీడీపీకి మద్దతు ఎలా ఇస్తారంటూ అభ్యర్థిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకున్న గ్రామస్తులపై రాజా అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశామని.. ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిషోర్ స్పష్టం చేశారు.





