విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్ యూనివర్సిటీ హాస్టళ్లలో యాంటీ-సూసైడ్ ఫ్యాన్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హాస్టళ్లలో ‘యాంటీ-సూసైడ్’ ఫ్యాన్లు.. విద్యార్థుల ప్రాణరక్షణకు గుజరాత్ యూనివర్సిటీ వినూత్న నిర్ణయం
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు హాస్టళ్లలో ప్రత్యేక spring-loaded safety fans ఏర్పాటు చేస్తోంది.
యూనివర్సిటీ మొత్తం 375 ప్రత్యేక ఫ్యాన్లను ఆర్డర్ చేయగా, ఇప్పటికే 268 ఫ్యాన్లను బాలికలు, బాలుర హాస్టళ్లలో అమర్చింది. అధిక బరువు పడితే ఫ్యాన్ కిందకు జారిపోయేలా ప్రత్యేక భద్రతా వ్యవస్థను రూపొందించారు.
అయితే ఇలాంటి సాంకేతిక చర్యలతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యం, కౌన్సెలింగ్, అకడమిక్ ఒత్తిడిపై కూడా నిరంతర దృష్టి అవసరమనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.





