శ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: వైసీపీ నేతలు

శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయం లో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ
సిపాయి సుబ్రమణ్యం
మీడియా సమావేశం.
శ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది.
అధికార పక్షం రాక్షస పాలన సాగుతోంది.
గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియలో ఎక్కడా ప్రజాస్వామ్యం కనబడలేదు.
తిరుపతి ఎంపీ గురుమూర్తి.
ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఎన్నడూ లేనివిధంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విధ్వంస కాండ ను సృష్టించారు.
శాంతిభద్రతలను కాపాడు తున్నామనే నెపంతో పోలీసులే పహారా కాస్తూ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
వైసీపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణం.
టిడిపి నేతలు మహాభారతాన్ని తలపించేలా వ్యవహరించారు.
నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళల చీరలు లాగడం, వాహనాలను ధ్వంసం చేయడం, అడ్డు వచ్చిన వారిపై దాడి చేయడం చూస్తే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఇలాంటి హింసాత్మక సంస్కృతి వల్ల కార్యకర్తలపై కేసులు నమోదై భవిష్యత్తు నాశనం అవుతుంది.
ఇలాంటి చర్యలకు త్వర లోనే స్వస్తి చెప్పాలి.
శ్రీకాళహస్తిలో జరిగిన దౌర్జన్యాలపై ఆధారాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాము.
అన్ని మండలాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేలా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవాలి.
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.





