స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హింసాత్మక చర్యలకు పాల్పడుతుందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ శ్రేణుల దాడి అంటూ టీడీపీ ఆరోపణ.
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో టీడీపీ నేతలపై దాడి చేశారని ఫిర్యాదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేత కారుకు నిప్పంటించారని ఆరోపణ.
అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం, పెదమండ్యం మండలాల్లో టీడీపీ నేతలపై దాడులు జరిగాయని ఫిర్యాదు. కడప జిల్లా చౌడేపల్లి మండలంలో టీడీపీ నేతలు, వారి బంధువులపై దాడి జరిగిందని ఫిర్యాదు.
చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ల పేరుతో జాతీయ రహదారిపై బైఠాయించారని ఆరోపణ. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు అడ్డుకోగా, ఆమె కిందపడిపోయారు. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా మాచర్లలో నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులపై దాడి.. ఎఫ్ఐఆర్ 180/2026ను ఫిర్యాదులో ప్రస్తావించిన టీడీపీ. ధర్మవరం సహా పలు ప్రాంతాల్లో పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపణ.
దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా ఆదేశించాలని ఎస్ఈసీకి టీడీపీ విజ్ఞప్తి.





