డిండి ఎత్తిపోతలపై స్పందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకుని పాలమూరు జిల్లా బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసిన తర్వాత మిగులు జలాలు ఉంటే ఇతర జిల్లాలకు ఇస్తాం.
కరివేన, ఉదండాపూర్, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్లన్నీ పూర్తిచేసి, నీరు నింపిన తర్వాత నీటి లభ్యతను బట్టి మిగులు జలాలు మాత్రమే ఇతర జిల్లాలకు ఇస్తాము.
పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ వెనుకబడిన ఈ జిల్లా హితాన్ని మొదటి వరుసలో పెట్టుకుని కార్యాచరణ రూపొందిస్తాం.
ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రికి ఈ ప్రాంత ప్రజల మనోవేదనను ఆకాంక్షలను తెలియజేస్తాం.
పాలమూరు ప్రాజెక్టులన్ని త్వరితగతిన పూర్తి కావాలి డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ కూడా పూర్తి చేయాలి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి అయితే నల్గొండ, పాలమూరు జిల్లాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.





