ప్రేమ పేరుతో వేధింపుల ఆరోపణలు.. అక్కతో బాధ పంచుకున్న మరుసటి రోజే యువతి మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని ఇందిరానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లిలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న గండమళ్ల చందన (23) మృతి చెందింది.
బొమ్మలరామారానికి చెందిన తుడుము శివ (23) గత కొంతకాలంగా ప్రేమ పేరుతో తనను వేధిస్తున్నాడని చందన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.
ఈ నెల 21న తన అక్కతో తన బాధను పంచుకున్న చందన, మరుసటి రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వేధింపుల ఆరోపణలు సహా ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు.





