హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ మెరుపు దాడులు.. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు

హైదరాబాద్, విజయవాడ సహా రెండు రాష్ట్రాల్లో కలిపి 15 ప్రాంతాల్లో ఏకకాలంలో కొనసాగుతున్న తనిఖీలు
మహారాష్ట్రలోని పూణే సైబర్ క్రైమ్ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ సోదాలు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, మోసపూరిత ఇన్‌వెస్ట్‌మెంట్ యాప్‌ల రాకెట్‌పై గురిపెట్టిన దర్యాప్తు సంస్థ
సామాన్యులను ఆశచూపి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర ముఠాలు
గత వారమే ఉత్తరాదిలోని ఢిల్లీ, ముంబై, గుర్గావ్‌లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ
నార్త్ ఇండియా సోదాల్లో దొరికిన లింకులతో తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెంట్లు, హవాలా ఆపరేటర్లపై తనిఖీలు
బెట్టింగ్ సొమ్మును షెల్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీల ద్వారా విదేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తింపు
కీలక నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో రికార్డులు, లావాదేవీల పత్రాలు, డిజిటల్ పరికరాలు పరిశీలిస్తున్న అధికారులు
సోదాల్లో భారీగా నగదు, బ్యాంకు ఖాతాలు, హవాలా నెట్‌వర్క్ ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం





