తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..

అభివృద్ధి అంటే ప్రభుత్వం ఇచ్చే నిధులతో కాదు.
సొంత ఆలోచనలతో నిధులు తేవడాన్ని అభివృద్ధి అంటారు.
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి నా సొంత ఆలోచనలతో నిధులు తెచ్చి రూపురేఖలు మార్చాను.
అనంతపురం జిల్లా పరిషత్ ని కూడా అభివృద్ధిలో మార్పులు చేయాలి.
త్వరలోనే తాడిపత్రికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్ వస్తోంది.
దేశంలో రెండు చోట్ల మాత్రమే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్స్ ఉన్నాయి.
యల్లనూరు టీడీపీ జడ్పీటీసీ గా ఎంటెక్ చదివే అమ్మాయిని పోటీలో పెడుతున్నాను.
ఓడిపోయిన పర్వాలేదు, ఫ్యాక్షన్ లేకుండా చేస్తా
ఎన్నికలు అంటే నాకు భయం లేదు.
ఎందుకంటే నా కొడుకు పనిచేశాడు,.. నేను పనిచేశా,.. మా అన్న పనిచేశాడు... అందుకే భయం లేదు.
రాబోయే రోజుల్లో
నేను, కేతిరెడ్డి పెద్దారెడ్డి రాళ్లు వేసుకుంటుంటే జనం మా ఇద్దరి మీద రాళ్లు వేస్తారు.
ప్రజల్లో మార్పు వచ్చింది.
2028 లో రాజకీయ నాయకులను మెట్లతో ( చెప్పులు) కొడుతారు.
రాబోయే ఎన్నికల్లో నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.





