మలుపు వద్ద అదుపుతప్పిన బస్సు.. చెట్టును ఢీకొని ఆరుగురు మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్–కేల్హరి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30–40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పహాడీహంస్వాహి సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను స్థానికులు, సహాయక సిబ్బంది సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.





