అమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశం

నవంబర్ 3కి బదులుగా 5న పోలింగ్ నిర్వహించే యోచన
నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పరిషత్ పోలింగ్ వాయిదాపై ఎస్ఈసీ మొగ్గు
అదే రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణతో ఇబ్బందులు తలెత్తే అవకాశం
పోలీస్ బందోబస్తు, ఎన్నికల సిబ్బంది కేటాయింపులో సమస్యలు వస్తాయన్న అంచనా
పోలింగ్ తేదీ మార్పుపై పోలీసు ఉన్నతాధికారుల అభిప్రాయం
నవంబర్ 3కి బదులుగా 5న పోలింగ్ నిర్వహిస్తే బాగుంటుందన్న సూచన
పరిషత్ ఎన్నికల షెడ్యూల్ మార్పుపై ఎస్ఈసీలో చర్చ
మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
ఒకట్రెండు రోజుల్లో పోలింగ్ తేదీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం
సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీలో ఇప్పటికే మార్పు
అక్టోబర్ 28కి బదులుగా నవంబర్ 1కి మున్సిపల్ పోలింగ్ వాయిదా
నవంబర్ 3న మున్సిపల్ ఓట్ల లెక్కింపు





