ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అల్పపీడనం ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన.
ఆది, సోమవారాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది 2-3 రోజుల్లో మరింత బలపడనుంది.
సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.
నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి.
గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో చెదురుమదురు తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
ఆదివారం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.





