ఏపీ ఎన్నికల హింసపై డీజీపీ కార్యాలయం ప్రకటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా 13 జిల్లాల్లో 31 హింసాత్మక ఘటనలు జరిగాయని డీజీపీ కార్యాలయం ప్రకటించింది. టీడీపీ, వైసీపీ, సీపీఐ(ఎం), స్వతంత్ర అభ్యర్థులపై దాడులు జరిగాయని.. రాష్ట్రవ్యాప్తంగా 22 హింసాత్మక ఘటనలు, నామినేషన్ పత్రాలు లాక్కోవడం, చించివేయడంపై మరో 9 ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపింది. వీటిపై ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేశామని.. మరో 11 ఘటనల్లో కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. ఇప్పటివరకు 54 మందికి పైగా నిందితులను గుర్తించామని.. మిగతా వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు.





