ఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్ నుంచి పంప్‌హౌస్‌లకు వెళ్తున్న నీటిని అధికారులు పరిశీలించారు. కొద్దిరోజులుగా ఈ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటిని తరలిస్తున్నారన్న ప్రచారంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. హార్టికల్చర్ డీడీ సువర్ణ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఈఈ అధికారులు ఈ పరిశీలన జరిపారు. రిజర్వాయర్ నుంచి జోన్ల వారీగా బోరు మోటార్లు, పైపుల ద్వారా పంప్‌హౌస్‌లకు వెళ్తున్న నీటిని తనిఖీ చేశారు.





