తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
వచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలురేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభంఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారుఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్త్రిపుర విద్యార్థినిపై వివక్ష.. ఢిల్లీ క్రియేటర్ క్షమాపణలుఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నంవచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలురేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభంఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారుఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్త్రిపుర విద్యార్థినిపై వివక్ష.. ఢిల్లీ క్రియేటర్ క్షమాపణలుఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నం
వాతావరణం
📅 తేదీ వారీగా

కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నం

ప్రత్యేక కథనంజాతీయం
కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కర్నూల్: కర్నూలు, నంద్యాల జిల్లాల మహిళా కలెక్టర్లను సైబర్ నేరగాళ్లు ఏం చేశారంటే.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కర్నూలు కలెక్టర్గా డాక్టర్ సిరి నంద్యాల కలెక్టర్గా రాజకుమారి సమర్థవంతంగా పనిచేస్తున్నారు. నిత్యం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు ప్రస్తుత ఎన్నికల సమయం కాబట్టి తీరిక లేకుండా ఉన్నారు ఇలాంటి సందర్భంలో సైబర్ మోసగాళ్లు రంగప్రవేశం చేశారు. కర్నూలు కలెక్టర్ సిరి ఫోటోని పేరును ఉపయోగించి మొబైల్ ద్వారా వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారు. తనకు 30000 కావాలి పంపించండి గంట తర్వాత రిటర్న్ చేస్తాను అంటూ కొందరికి వాట్సాప్ లో మెసేజ్లు వచ్చాయి. ఇది కలెక్టర్ దృష్టికి వచ్చింది వెంటనే అప్రమత్తమైన కలెక్టర్ సిరి తన పేరు మీద ఎవరైనా డబ్బులు అడిగినా డిమాండ్ చేసిన వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక నంద్యాల కలెక్టర్ తో కూడా ఈ బెడద తప్పలేదు. ఆమె పేరు ఫోటో ఉపయోగించి ఒక ఫోన్ నెంబర్ ద్వారా నంద్యాల జిల్లా వాసులకు వాట్సప్ మెసేజ్ లు వెళ్లాయి. డబ్బులు అడిగినట్లుగా కలెక్టర్ పేరుతో మెసేజ్లు వెళ్లడంతో కలెక్టర్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె కూడా అప్రమత్తమే అలర్ట్ చేసింది. తాను ఎవరిని డబ్బులు అడగనని ఎవరైనా తన పేరు ఫోటో ఉపయోగించి డబ్బులు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇలా ఒకేసారి ఒకే సమయంలో ఇద్దరు మహిళ కలెక్టర్ల పేరు ఫోటోలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేయడం ఉమ్మడి కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చూశారుగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అంతట హాట్ టాపిక్ అయ్యింది

X లో చూడండి ›

సంబంధిత వార్తలు