నందలూరులో టీడీపీ వర్గపోరు.. గాల్లోకి ఐదు రౌండ్లు, కార్లకు నిప్పు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో ZPTC నామినేషన్ల సందర్భంగా టీడీపీలోని రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
అభ్యర్థి ఎంపిక విషయంలో తలెత్తిన వివాదం ముదిరి, ఇరువర్గాలు రాళ్లు, కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఓ టీడీపీ నేత తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడైంది.
ఘర్షణలో పలువురు గాయపడగా, రెండు కార్లకు నిప్పంటించారు. పలు ద్విచక్రవాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌కు కూడా గాయాలైనట్లు సమాచారం.
నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనతో నందలూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ చేపట్టారు.





