ప్రేమగా హగ్ ఇచ్చాడు.. ఐదు పక్కటెముకలు విరిగాయి! చైనాలో షాకింగ్ ఘటన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో అక్టోబర్ 18న ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్యపై ప్రేమను వ్యక్తం చేస్తూ భర్త గట్టిగా హగ్ ఇవ్వడంతో ఆమె తీవ్ర నొప్పితో బాధపడింది.
ఆసుపత్రికి తీసుకెళ్లి CT స్కాన్ చేయగా ఐదు పక్కటెముకలు విరగడంతో పాటు మరో ఎముకకు క్రాక్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.
ఆమెకు ఆస్టియోపొరోసిస్ కారణంగా ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల చిన్నపాటి ఒత్తిడికే ఈ పరిస్థితి ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు.
ప్రేమగా ఇచ్చిన ఒక్క హగ్.. ఆసుపత్రి పాలయ్యేలా చేసింది!





