విజయవాడ సరస్ మేళాలో జోరుగా అమ్మకాలు, వారం రోజుల్లోనే రూ. 7 కోట్ల వ్యాపారం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడలో 'సరస్ మేళా'కు విశేష స్పందన.. కోట్ల రూపాయల్లో అమ్మకాలు..!
విజయవాడ పున్నమి ఘాట్‌లో జరుగుతున్న జాతీయ సరస్ మేళాకు అపూర్వ స్పందన.. తొలి వారంలోనే ఏకంగా రూ. 7 కోట్ల మేర అమ్మకాలు జరిగి రికార్డు సృష్టించాయి..
ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభమైన ఈ మేళా.. ఇప్పటివరకు సుమారు 9 లక్షల మంది సందర్శించారు..
ఢిల్లీ వెలుపల తొలిసారిగా విజయవాడలో నిర్వహిస్తున్న ఈ మేళాలో 33 రాష్ట్రాలు పాల్గొన్నాయి.. 579 స్టాళ్లను స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేశారు..
హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కొండపల్లి-ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ దుస్తులు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఏపీ స్టాళ్లలో కొనుగోళ్లు జోరు.. 'ఇండియా ఫుడ్ కోర్ట్'లోని 50 స్టాళ్లలో రుచికరమైన వంటకాలు.. అరకు కాఫీ, మాడుగుల హల్వా కొనుగోలు చేయడానికి ప్రజల ఆసక్తి..





