నల్లగొండ వర్సెస్ పాలమూరు.. డిండి ప్రాజెక్టుతో ముదురుతున్న జల వివాదం

ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై రగడ
డిండి నీటి తరలింపుపై సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్న పాలమూరు నేతలు
డిండి ప్రాజెక్టును పూర్తి చేయాలని పట్టుబడుతున్న నల్లగొండ ఎమ్మెల్యేలు
డిండి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌లోనే రెండు జిల్లాల నేతల మధ్య కోల్డ్ వార్
ఏదుల నుంచి నీటిని తరలిస్తే పాలమూరు ఆయకట్టుకు నష్టం జరుగుతుందంటున్న స్థానిక నేతలు
ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీరివ్వాలంటే డిండి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందేనంటున్న నల్లగొండ నేతలు
డిండి బ్యారేజీ టెండర్లు పూర్తి.. భూసేకరణపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
డిండి ప్రాజెక్టు భూసేకరణకు అడ్డంకులపై నల్లగొండ నేతల ఆగ్రహం
రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీటి తరలింపు ప్రతిపాదన
ఏదుల నుంచి 437 మీటర్ల లెవెల్‌లో నీటి తరలింపుపై వివాదం
డిండి ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బాధ్యత పెట్టిన నల్లగొండ ఎమ్మెల్యేలు
పాలమూరు ప్రయోజనాలు కాపాడాలని సీఎం రేవంత్‌ను కోరుతున్న జిల్లా నేతలు
రెండు జిల్లాల నీటి పంచాయితీని సీఎం రేవంత్ ఎలా పరిష్కరిస్తారన్న ఉత్కంఠ





