కెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!

కెనడా వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కొత్త ప్రయాణ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ముంబై నుంచి టొరంటోకు అక్టోబర్ 25, 2026 నుంచి కొత్త సీజనల్ విమాన సర్వీసును ప్రారంభించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఈ విమానం నేరుగా టొరంటోకు వెళ్లదు. మధ్యలో ఇటలీ రాజధాని రోమ్‌లో ఆగి, అక్కడి నుంచి టొరంటోకు చేరుకుంటుంది. ఈ ప్రయాణానికి 20 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.
బోయింగ్ 777-300ER విమానంతో ఈ సర్వీసును నిర్వహించనున్నారు. ఇందులో ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. మరోవైపు, టొరంటో నుంచి ముంబైకి తిరుగు ప్రయాణంలో నాన్‌స్టాప్ సర్వీసును నడపనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఈ సర్వీసు వారంలో బుధ, శుక్ర, ఆదివారాల్లో అందుబాటులో ఉండనుంది.
2027 మార్చి 26 వరకు ఈ సీజనల్ సర్వీసును కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ సహా ఇతర నగరాల నుంచి కెనడా వెళ్లే ప్రయాణికులు ముంబై మీదుగా ఈ విమానాన్ని ఎంచుకోవచ్చు. అయితే టికెట్ బుక్ చేసుకునే ముందు ప్రయాణ తేదీ, రోమ్‌లో స్టాప్‌ఓవర్ వివరాలు, మొత్తం ప్రయాణ సమయాన్ని ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.





