వివిఫై ఇండియా ఫైనాన్స్‌లో 3.34 కోట్ల సైబర్ మోసం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వివిఫై ఇండియా ఫైనాన్స్‌లో 3 కోట్ల 34 లక్షల 50 వేల రూపాయల సైబర్ మోసం జరిగిందని టీజీసీఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాస్ టీవీ9కు తెలిపారు. అక్టోబర్ 19న కేవలం 87 నిమిషాల వ్యవధిలో 183 లావాదేవీల ద్వారా బేగంపేట ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా నుంచి 52 అనుమానిత ఖాతాలకు నిధులు బదిలీ అయ్యాయి. కంపెనీ సీఎఫ్ఓ చిరాగ్ సాహ్ని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి 40 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు. నార్త్, ఈస్ట్ మ్యూల్ ఖాతాల ద్వారా డబ్బులు మాయమయ్యాయని.. కంపెనీ ఉద్యోగి ప్రమేయంపైనా సైబర్ ఆడిట్ చేస్తున్నామన్నారు.





