ఎండిన పంటలను పరిశీలించాలన్న బీవీ రాఘవులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మంత్రులు కేబినెట్‌లో కూర్చుంటే సరిపోదని.. సీఎంతో పాటు మంత్రులు క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటలను పరిశీలించాలని సీపీఎం నేత బీవీ రాఘవులు నల్లగొండలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కరువు పరిస్థితులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై అఖిలపక్షంతో ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.





