గుంతకల్ ఎంపీడీవో ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అనంతపురం జిల్లా గుంతకల్ ఎంపీడీవో కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీటీసీ నామినేషన్లు వేయడానికి వచ్చిన వైసీపీ మహిళా అభ్యర్థులను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. మహిళా అభ్యర్థులపై దాడి చేసి.. వారి చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు లాక్కుని చించేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.





