గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత నౌకాదళ రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్ గోవాలో ప్రారంభమయ్యాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యాలపై గోవాలోని ఐఎన్ఎస్ హంస ఎస్‌బీటీఎఫ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 63 వేల కోట్ల నుంచి 64 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 26 రాఫెల్-ఎం యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్-ఫ్రాన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పాత మిగ్-29కె స్థానంలో వీటిని మోహరించనుండగా.. 2028-29 నాటికి డెలివరీ పూర్తికానుంది.





